Chintalapudi: ఎర్రంపల్లి సర్పంచ్ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా విశ్వేశ్వర్ రెడ్డి!
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా జగ్గవరపు విశ్వేశ్వర్ రెడ్డి (విసుబాబు) సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
Chintalapudi: ఎర్రంపల్లి సర్పంచ్ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా విశ్వేశ్వర్ రెడ్డి!
ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థిగా జగ్గవరపు విశ్వేశ్వర్ రెడ్డి (విసుబాబు) నేడు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్ అభ్యర్థిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
నా ఊరికి ఏదో ఒక మంచి చేయాలనే సదుద్దేశంతోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలోకి దిగాను. 'మన ఊరు - మన అభివృద్ధి - మన విసుబాబు అన్న' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించడంతో పాటు, గ్రామానికి మేలు చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
తన నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చి మద్దతు తెలిపిన గ్రామస్తులకు, పెద్దలకు మరియు నాయకులకు జగ్గవరపు విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను పేరుపేరునా కోరి ప్రార్థించారు.




