VR Puram: ఉపాధి కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి సీపీఎం!
VR Puram: వి.ఆర్ పురంలో ఉపాధి హామీ కూలీల వేతనాలు చెల్లించకపోవడంపై సీపీఎం ఆగ్రహం. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక.
VR Puram: ఉపాధి కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి సీపీఎం!
VR Puram: పోలవరం జిల్లా వి ఆర్ పురం మండలం రేకపల్లి గ్రామంలోని ఉపాధి హామీ పని చేసినటువంటి కార్మికులకు సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు వేతనాలు చెల్లించకపోవడంతో విఆర్ పురం ఎంపీడీవో కార్యాలయం మరియు ఏపీఓ ఆఫీసుల వద్ద కార్మికులు ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఒకపక్క ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు వేయక కూలీలకు కూలి దొరకడం లేదని మరోపక్క ఉపాధి హామీ పని చేయించుకొని వారికి వేతనాలు రెండు మూడు నెలల నుంచి చెల్లించకపోవడం అనేది దారుణమని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని అన్నారు.
కోట్లాది రూపాయలు ఉపాధి హామీ పనికి చెల్లిస్తున్నామని ప్రచారం చేస్తూ ఆర్భాటాలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఇవాళ కోట్లాది రూపాయలు ఎవరు ఎకౌంట్లో చేరాయో చెప్పాలని కోరారు.కూలీల ఖాతాలో చేరకుండా ఆ డబ్బులన్నీ ఏమైనట్టు అని ప్రశ్నించారు. తక్షణమే ఉపాధి కార్మికులకు వేతనాలు చెల్లించాలని లేదంటే మండల వ్యాప్తంగా కార్మికుల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పంకు సత్తిబాబు,పూనెం ప్రదీప్, కుమార్, తుర్రంబాబురావు, సారా పాండురాజు ,ఉపాధి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




