VR Puram: తోటపల్లి యువ వైద్యుడు డా. అవినాష్‌కు అరుదైన ఘనత

VR Puram: వి.ఆర్.పురం మండలం తోటపల్లికి చెందిన డా. దూడి అవినాష్ ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండీ పల్మనాలజీ సీటు సాధించి గ్రామానికి పేరు తెచ్చారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 25 Nov 2026 9:45 PM IST
VR Puram
X

VR Puram: తోటపల్లి యువ వైద్యుడు డా. అవినాష్‌కు అరుదైన ఘనత

వి ఆర్ పురం: వి.ఆర్.పురం మండలం, తోటపల్లి గ్రామానికి చెందిన యువ వైద్యుడు డా. దూడి అవినాష్ సాధించిన ఘనత ఇప్పుడు గ్రామమంతా చర్చనీయాంశంగా మారింది.వీరస్వామి తనయుడైన అవినాష్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు. పల్లెటూరి వాతావరణంలో పెరిగినా, పెద్ద కలలు కన్నారు. ఆ కలలకు రెక్కలు తొడిగి శ్రీకాకుళంలోని ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.అక్కడితో ఆగలేదు.

మరింత ఉన్నత చదువు కోసం కష్టపడి చదివి, ఇప్పుడు విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండీ (పల్మనాలజిస్ట్) సీటు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, వైద్యరంగంలో ఇంత పెద్ద విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు.

అవినాష్ విజయం తొటపల్లి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. "మన ఊరి నుంచి కూడా డాక్టర్ కావచ్చు, పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్లు తెచ్చుకోవచ్చు" అని గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అవినాష్ కు ఘనంగా అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR