Eluru: హింసకు గురైన మహిళలకు 'వన్ స్టాప్ సెంటర్' ఒక వరం: సీడీపీఓ లక్ష్మి

Eluru: కుక్కునూరులో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ చట్టాలు, వన్ స్టాప్ సెంటర్ సేవలు మరియు పోక్సో చట్టంపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 18 July 2026 4:35 PM IST
Eluru
X

Eluru: హింసకు గురైన మహిళలకు 'వన్ స్టాప్ సెంటర్' ఒక వరం: సీడీపీఓ లక్ష్మి

ఏలూరు: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో కుక్కునూరు మండలంలోని KGBV వేదికగా ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ, వన్ స్టాప్ సెంటర్ (OSC) సేవలు, ప్రీ-మ్యారిటల్ కౌన్సెలింగ్ సేవలు, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013 (POSH Act), గృహ హింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నివారణ, గ్రామ స్థాయి బాల్య వివాహాల నిరోధక కమిటీలు మరియు పోక్సో (POCSO) చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా మిషన్ కోఆర్డినేటర్ & నోడల్ అధికారి శ్రీమతి ఈ. తులసి మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు లేదా ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే 14416 టెలి-మానస్ హెల్ప్‌లైన్, మహిళల సహాయం కోసం 181 ఉమెన్ హెల్ప్‌లైన్, పిల్లల రక్షణ కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, అత్యవసర పరిస్థితుల్లో 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం మహిళలు, బాలికల సంక్షేమం కోసం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కుక్కునూరు సీడీపీఓ శ్రీమతి అనంత లక్ష్మి మాట్లాడుతూ, వన్ స్టాప్ సెంటర్ ద్వారా హింసకు గురైన మహిళలకు వైద్య, పోలీసు, న్యాయ సహాయం, మానసిక పరామర్శ, తాత్కాలిక ఆశ్రయం వంటి సమగ్ర సేవలు ఉచితంగా అందుతున్నాయని వివరించారు. అలాగే ప్రీ-మ్యారిటల్ కౌన్సెలింగ్ సేవల ద్వారా వివాహానికి ముందు యువతకు కుటుంబ విలువలు, పరస్పర అవగాహన, బాధ్యతలు మరియు ఆరోగ్య అంశాలపై కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గృహ హింస నిరోధక చట్టం మరియు POSH Act–2013 నిబంధనలపై అవగాహన కల్పించారు.

జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) సిబ్బంది శ్రీ పి. రాజేష్ మరియు శ్రీ వై. రాజ్‌కుమార్ బాల్య వివాహాల నివారణ, గ్రామ స్థాయి బాల్య వివాహాల నిరోధక కమిటీల బాధ్యతలు, పోక్సో (POCSO) చట్టం, పిల్లల హక్కులు మరియు బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు (AWWs), ఏఎన్‌ఎంలు (ANMs), స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story