Kukunoor: నాగన్నకు మహిళల వీరతిలకం.. ఎన్నికల ప్రచారంలో సందడి!
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు కూటమి సర్పంచ్ అభ్యర్థి ములిశెట్టి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారానికి మహిళలు వీరతిలకంతో ఘన స్వాగతం పలికారు.
Kukunoor: నాగన్నకు మహిళల వీరతిలకం.. ఎన్నికల ప్రచారంలో సందడి!
Kukunoor: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కుకునూరులో ఎన్నికల సందడి ఊపందుకుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు బలపరిచిన కూటమి సర్పంచ్ అభ్యర్థి ములిశెట్టి నాగేశ్వరరావు శనివారం ప్రచార బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన నాగన్నకు మహిళలు ఘన స్వాగతం పలికారు. నుదుటన వీరతిలకం దిద్ది, విజయాన్ని కాంక్షిస్తూ ఆశీర్వదించారు. మహిళల ఆత్మీయ స్వాగతంతో ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
కాలనీల్లో ఇంటింటికీ నాగన్న ప్రచారం!
కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట నడవగా కుకునూరులోని రైస్ మిల్ కాలనీ, రామసింగారం కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, వారి ఆదరాభిమానాలను కోరారు. స్థానికులతో మమేకమవుతూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
ప్రజల అభిమానానికి సేవతో బదులిస్తా!
ఈ సందర్భంగా ములిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎప్పుడూ తమ పార్టీ అభ్యర్థులను ఆదరిస్తూ, విజయాలను అందిస్తున్న కుకునూరు ప్రజల అభిమానానికి సేవతో బదులివ్వాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి, ప్రజాసేవకు కృషి చేయాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
రానున్న ఎన్నికల్లో తనకు కేటాయించిన 'ఉంగరం' గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, ప్రజలకు మరింతగా సేవ చేసే అవకాశం కల్పించాలని నాగేశ్వరరావు ఓటర్లను కోరారు.
మహిళల వీరతిలకాలు, కూటమి నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో కుకునూరులో నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం కొనసాగింది.




