Chintalapudi: సూపర్ సిక్స్ హామీల వైఫల్యంపై చింతలపూడిలో వైసీపీ పోరు
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
Chintalapudi: సూపర్ సిక్స్ హామీల వైఫల్యంపై చింతలపూడిలో వైసీపీ పోరు
Chintalapudi: ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు రెండేళ్లు పూర్తి అయ్యాయని చింతలపూడిలో వైయస్సార్సీపి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది.
నియోజకవర్గ వైసిపి కన్వీనర్ కంభం. విజయరాజు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు నుండి నిరసన ర్యాలీని ఫైర్ స్టేషన్ సెంటర్లోని వైయస్సార్ విగ్రహం వరకు సాగింది.పాత బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన "సూపర్ సిక్స్" హామీలు నేటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, యువతకు ఉపాధి అవకాశాలపై స్పష్టత లేకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు.
రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీటి హామీలు అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రతీకార ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




