Sattenapalli: సత్తెనపల్లిలో 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల వినూత్న గణపతి!

Sattenapalli: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల వినూత్న వినాయక విగ్రహం ఏర్పాటు. ఆరోగ్యకరమైన సందేశంతో రామభక్త బృందం 4 దశాబ్దాల సంప్రదాయం.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 14 Sept 2026 1:58 PM IST
Sattenapalli
X

Sattenapalli: సత్తెనపల్లిలో 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల వినూత్న గణపతి!

Sattenapalli: సత్తెనపల్లి లోని కట్టమూరి వారి వీధి సెంటర్ లో బెల్లం తో వినాయకుడి విగ్రహం ఎర్పాటు. రెండు టన్నుల బెల్లం తో వినాయకుడి విగ్రహాన్ని ఎర్పాటు చేసిన రామాలయ గణేష్ ఉత్సవ కమిటీ.

కమిటీ ఆధ్వర్యంలో 4 దశాబ్దాలుగా ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహాలను ఎర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఆరోగ్యం, మాధుర్యం పంచే సందేశంతో సుమారు రూ.2 లక్షల వ్యయంతో 12 అడుగుల ఎత్తులో ఈ బెల్లపు వినాయకుడిని తీర్చిదిద్దారు.

ఈ భారీ బెల్లం విగ్రహాన్ని తిలకించేందుకు, తొలి పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI