Chirala: చీరాలలో కన్నులపండువగా 'హర్ ఘర్ తిరంగా' భారీ ర్యాలీ!
Chirala: బాపట్ల జిల్లా చీరాలలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ. 300 అడుగుల జాతీయ జెండాతో సందడి చేసిన విద్యార్థులు.
Chirala: చీరాలలో కన్నులపండువగా 'హర్ ఘర్ తిరంగా' భారీ ర్యాలీ!
చీరాల: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చీరాలలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. శ్రీ మేధావి, చైతన్య భారతి కళాశాల విద్యార్థులతో కలిసి శ్రీ మేధావి కాలేజీ వద్ద ప్రారంభమైన, చీరాల పట్టణ ప్రధాన రహదారులలో తిరంగ ర్యాలీ నిర్వహించారు, 300 అడుగుల భారీ మువ్వన్నెల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ మువ్వల వెంకటరమణ రావు ,జిల్లా బీజేపీ ఇంచార్జ్ శ్రీ గాజుల వెంకయ్య నాయుడు, తిరంగా ర్యాలీ జిల్లా కన్వీనర్ మామిడాల రమేష్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని బాపట్ల యువజన మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, దేశభక్తులు, జాతీయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలు, మువ్వన్నెల జెండాలతో చీరాల వీధులు దేశభక్తి వాతావరణాన్ని తలపించాయి.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతి భారతీయుడి గర్వానికి, స్వాభిమానానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో మరింతగా పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీ మేధావి కాలేజ్ విద్యార్థులకు మరియు చైతన్య భారతి డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు ,బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువమోర్చా సభ్యులు, అభిమానులు మరియు దేశభక్తులందరికీ హర్ ఘర్ తిరంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువమోర్చా సభ్యులు, అభిమానులు, విద్యార్థులకు, కళాశాల యాజమాన్యానికి మరియు దేశభక్తులందరికీ హర్ ఘర్ తిరంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.




