Guntur: రంగంలోకి కలెక్టర్.. అర్ధరాత్రి దాటాక తిన్న భోజనంతో ఊరంతా అస్వస్థత!

Guntur: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో ప్రార్థనా సమావేశాల భోజనం తిని 44 మంది అస్వస్థతకు గురయ్యారు.

SHAREEF, PONNURU
Published on: 15 May 2026 9:25 PM IST
Guntur
X

Guntur: రంగంలోకి కలెక్టర్.. అర్ధరాత్రి దాటాక తిన్న భోజనంతో ఊరంతా అస్వస్థత!

గుంటూరు: చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ శుక్రవారం పర్యటించారు. కొత్త రెడ్డిపాలెం లో కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల అస్వస్థకు గురైనట్లు సమాచారం అందిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి స్థానికంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వెంటనే వైద్య సేవలు అందించడం జరిగింది. అస్వస్థత గురైన వారికి మంచి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సంఘటన తీవ్రతరం కాకుండా రేయింబవళ్ళు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అన్ని మందులు సిద్ధంగా ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిస్థితులు చేయి దాటరాదని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి పరిస్థితులు పూర్తి అదుపులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతి ఇంటికి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, తాగు నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం పక్కాగా చేపట్టాలని అన్నారు. అస్వస్థత గల కారణాలను పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆదేశించారు. అస్వస్థతకు గురైన వారు ఎటువంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని చెప్పారు. మంచి వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. మూడు షిఫ్ట్ లలో వైద్యులు పని చేయాలని ఆదేశించారు. 108 వాహనాలు రెండు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి వైద్య పరిస్థితులను ఆరా తీయాలన్నారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని చెప్పారు. నీటి నమూనాలు పరీక్షించగా కెమికల్ సంబంధిత అంశాలలో నెగిటివ్ రిపోర్టు వచ్చిందని, బాక్టీరియల్ ఎనాలసిస్ పరీక్షలు రావాల్సి ఉందని అన్నారు.

ప్రతి క్షణం పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. రోగులకు, అవసరమైతే ప్రజలకు తాజా మంచి భోజనం ఏర్పాటు చేయాలని ఆర్.డి.ఓ కు ఆదేశాలు జారీ చేశారు. 44 మందికి అస్వస్థతకు గురైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలియజేశారు. బాధితులకు వేడిమి వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పడకలు అవసరమైతే వాటిని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొద్ది మొత్తంలో తీవ్రత ఉన్నట్లు గుర్తించిన నాలుగు కేసులను తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందని చెప్పారు. కొత్త రెడ్డిపాలెం గ్రామంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో ప్రార్థనా సమావేశాలు జరిగాయని 13వ తేదీ రాత్రి కాస్త సమయం దాటిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారని, భోజనాలకు రాని వారికి ఇంటికి ఆహారాన్ని పంపించినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని అన్నారు. ఆహారాన్ని 14వ తేదీ ఉదయం, కొంత మంది మధ్యాహ్నం కూడా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని అన్నారు. పూర్తి సమాచారం కోసం విచారణ చేపట్టామని, ఆహార తయారీ కోసం ఉపయోగించిన నీరు, మాంసాహారం తదితర అంశాల పట్ల పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సి ఉందని అన్నారు. దాదాపు 100 మంది భోజనం తీసుకున్నట్లు ఇప్పటి వరకు తెలియవచ్చిందని తెలిపారు మొదటగా కడుపునొప్పి వంటి ప్రాథమిక లక్షణాలతో పది మంది మాత్రమే రావడం జరిగిందని, దీన్ని గుర్తించి ఇంటింటికి వెళ్లి మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితిని కనుగొనడం జరిగిందని వివరించారు. వైద్య బృందాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయని, పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story