Navuluru: నవులూరు 22A భూముల వివాదంపై ప్రభుత్వం స్పందించాలి!

Navuluru: గుంటూరు జిల్లా నవులూరులో 22A నిషేధ భూముల విడుదలపై నిరసన. రైతులకు మద్దతు తెలిపిన సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 18 Aug 2026 1:27 PM IST
Navuluru
X

Navuluru: నవులూరు 22A భూముల వివాదంపై ప్రభుత్వం స్పందించాలి!

Navuluru: సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నవలూరులో 22A నిషేధ భూములను విడుదల చేయాలి అంటూ నిరసన కార్యక్రమం.

నవులూరు రైతులకు మద్దతు తెలిపిన సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు.సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ వెంకటేశ్వరరావు కామెంట్స్.

సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నవలూరు 22ఏ భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22ఏ బాధితులకు కనువిప్పు కలిగించే ఉదాహరణ అన్నారు.నవలూరు సర్వే నంబర్ 774లో సుమారు 30 ఎకరాల భూమి 22ఏ వివాదంలో ఉంది.

దశాబ్దాలుగా భూములను అనుభవిస్తున్న ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.22ఏలో చేర్చిన తర్వాత భూములపై హక్కులు, లావాదేవీల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాధితులకు నోటీసులు ఇవ్వకుండా భూములను ప్రభుత్వ భూమిగా పరిగణించడం సరికాదు.

గుంటూరు కలెక్టర్‌ 30 ఎకరాల భూమిని CRDAకి అప్పగిస్తూ లేఖ రాయడంపై అభ్యంతరం. నిజంగా ప్రభుత్వ భూమి అయితే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేట్ హక్కులు ఉన్న భూములకు పరిహారం ఇవ్వాలి.

రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సమస్యను ఎదుర్కొంటున్న బాధితుల కోసం 22ఏను రోల్‌బ్యాక్ చేయాలి. అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదు,అయితే రైతులు, భూ యజమానుల ఆస్తి హక్కులను పరిరక్షిస్తూ రాజధాని నిర్మాణం జరగాలి.

నవలూరు భూములపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి. ఈరోజు సాయంత్రం గుంటూరు కలెక్టర్‌ను కలిసి భూములకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను సమర్పిస్తాం. కలెక్టర్‌ స్పందన సంతృప్తికరంగా లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాము.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI

Next Story