Guntur: భూ అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి: కలెక్టర్!

Guntur: గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం సీఆర్‌డీఏ రెండో విడత భూ సమీకరణపై కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ సమీక్షించి భూ అభ్యంతరాలపై చర్యలకు ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Nov 2026 6:54 PM IST
Guntur
X

Guntur: భూ అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి: కలెక్టర్!

గుంటూరు: భూ సమీకరణపై అందుతున్న అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ (CM.Saikanth Varma) ఆదేశించారు. సి.ఆర్.డి.ఏ రెండవ విడత భూ సమీకరణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిడమర్రు, నవులూరులో 22(ఏ) క్రింద ఉన్న అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. జలవనరులు గల ప్రదేశాలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్ళాలని అన్నారు. రైల్వే లైన్ కు అవసరమగు గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.

సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ మాట్లాడుతూ... రైల్వే నుండి డ్రాయింగ్ లు రావలసి ఉందన్నారు. 1153 అభ్యంతరాలు మొత్తం అందాయన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, సి.ఆర్.డి.ఏ డిప్యూటీ కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN