Vinukonda: ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ విధానాన్ని పరిశీలించిన మార్కెటింగ్ కమిషనర్

Vinukonda: వినుకొండలో ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ విధానాన్ని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ పి. రవి సుభాష్. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి హామీ.

KAREEMULLA, VINUKONDA
Published on: 26 Aug 2026 7:08 PM IST
Vinukonda
X

Vinukonda: ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ విధానాన్ని పరిశీలించిన మార్కెటింగ్ కమిషనర్

వినుకొండ: వినుకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కాపురం రోడ్డులో ఉన్న చెక్‌పోస్ట్‌ను రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ పి. రవి సుభాష్ బుధవారం సందర్శించారు. మార్కెటింగ్ శాఖలో డిజిటలైజేషన్‌లో భాగంగా అమలు చేస్తున్న ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ విధానాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

చెక్‌పోస్ట్‌లో అనుమతుల జారీ, డిజిటల్ విధానంలో జరుగుతున్న పర్యవేక్షణ, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ విధానం వల్ల మార్కెటింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులు, వ్యాపారులకు మరింత సౌలభ్యం కలుగుతోందని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పీఎస్ వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా మార్కెటింగ్ ఏడీ కె.వి.ఎన్. ఉపేంద్ర కుమార్, యార్డ్ సెక్రటరీ ఎస్. శ్రీనివాసరావు, సూపర్‌వైజర్ రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story