Guntur: గుంటూరు సీఐడీ ఆఫీసులో 320 అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన!
Guntur: గుంటూరు రీజనల్ సీఐడీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన కొనసాగుతోంది. అక్టోబర్ 21 నుంచి 24 వరకు తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల పరిశీలన జరగనుంది.
Guntur: గుంటూరు సీఐడీ ఆఫీసులో 320 అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన!
Guntur: అగ్రిగోల్డ్ బాండ్స్ పరిశీలన లో బాగంగా ఈ రోజు అనగా ది. 17.10.2026 వ తేదీన చేబ్రోలు, కాకుమాను మరియు పెదనందిపాడు మండలము నుండి వచ్చిన 240 మంది వద్ద నుండి 320 అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన జరిగింది.
తేదీలు 21.10.2026 నుండి 24.10.2026 వరకు తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు మరియు ఫిరంగిపురం మండలాలకు సంబంధించిన అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన జరుగును. (అగ్రిగోల్డ్ బాండ్లలలో అడ్రసు ను బట్టి) గుంటూరు రీజనల్ ఆఫీస్, సి.ఐ.డి. కార్యాలయంలో జరుగును.
కావున, పై మండలాలకు చెందిన అగ్రిగోల్డ్ బాండ్ హోల్డర్లందరూ ఈ విషయాన్ని గమనించి, పై తెలిపిన తేదీలలో గుంటూరు మెడికల్ కాలేజీ వెనుక వైపు వున్నటువంటి గుంటూరు రీజనల్ ఆఫీస్, సి.ఐ.డి. కార్యాలయానికి హాజరుకావలసిందిగా తెలియజేయడమైనది. వారు వచ్చేటపుడు ఒరిజినల్ బాండ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మరియు సంబంధిత జిరాక్స్ కాపీలు తీసుకొని రావలెను.




