Guntur: మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాలలో AICTE-ATAL ఎఫ్‌డీపీ ప్రారంభం!
Guntur: గుంటూరు మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో వ్యవసాయం, స్మార్ట్ గ్రామాలపై AI, IoT ఆధారిత వారం రోజుల AICTE-ATAL ఎఫ్‌డీపీ ప్రారంభం.
Guntur: మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాలలో AICTE-ATAL ఎఫ్‌డీపీ ప్రారంభం!
Guntur: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడగుంట మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో AICTE–ATAL FDP ప్రారంభం. మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో AICTE Training and Learning (ATAL) Academy స్పాన్సర్‌షిప్‌తో “AI & IoT Applications in Agriculture & Smart Villages” అనే అంశంపై వారంపాటు నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 60 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. AI, IoT వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను వ్యవసాయం, స్మార్ట్ గ్రామాలు మరియు గ్రామీణాభివృద్ధిలో వినియోగించే విధానాలపై నిపుణులచే శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ డా. మలినేని పెరుమల్లు మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అధ్యాపకులు తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. AI, IoT ఆధారిత సాంకేతికతలు భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు దోహదపడతాయని పేర్కొన్నారు.
డైరెక్టర్ డా. కె. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, ఇలాంటి FDPలు అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను, పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు.
FDP కోఆర్డినేటర్ డా. డి. విజయ సారధి పాల్గొంటున్న అధ్యాపకులకు స్వాగతం పలుకుతూ, మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా ప్రతి అధ్యాపకుడు నిరంతర అభ్యాసాన్ని కొనసాగించాలని అన్నారు. ఈ FDPను కేవలం శిక్షణా కార్యక్రమంగా కాకుండా జ్ఞానాన్ని పంచుకునే, పరిశోధనకు కొత్త అవకాశాలను అన్వేషించే వేదికగా ఉపయోగించుకోవాలని కోరారు.
కార్యక్రమానికి NIT వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. సంజయ కుమార్ పాండా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో AI ఆధారిత వ్యవసాయం, IoT ఆధారిత స్మార్ట్ ఫార్మింగ్, ప్రెసిషన్ అగ్రికల్చర్, స్మార్ట్ విలేజ్ టెక్నాలజీస్ తదితర అంశాలపై నిపుణులు అవగాహనకల్పించనున్నారు.




