Gurazala: విజేతలకు బహుమతులు అందజేసిన ఎంఈఓ సత్యనారాయణ!

Gurazala: గురజాలలో యుటిఎఫ్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో అక్షర స్కూల్ విద్యార్థులు మొదటి ర్యాంక్ సాధించారు. ఎంఈఓ సత్యనారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు.

SK SAIDA, GURAJALA
Published on: 10 Sept 2026 7:23 PM IST
Gurazala
X

Gurazala: విజేతలకు బహుమతులు అందజేసిన ఎంఈఓ సత్యనారాయణ!

Gurazala: గురజాల యుటిఎఫ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో గురజాల ప్రభుత్వ హైస్కూల్ నందు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పరీక్షను గురువారం నిర్వహించారు.

ఈ టాలెంట్ టెక్స్ట్ పరీక్షలో అక్షర స్కూల్ విద్యార్థులు షేక్ అమీరూనిస, యాగంటి లక్ష్మీ సంధ్య, వై ఉదయ్ కోటిరెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. వారికి ఎంఈఓ సత్యనారాయణ చేతుల మీదగా షీల్డ్ను బహుమతిని ప్రజెంట్ గా చేశారు.

ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు అరుణ్ కుమార్, యుటిఎఫ్ నాయకులు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA