Guntur: హరిశ్చంద్రాపురంలో భూసమీకరణ గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ

Guntur: అమరావతి రెండో విడత భూసమీకరణపై హరిశ్చంద్రాపురంలో గ్రామసభ. భూసమీకరణను విజయవంతం చేయాలని రైతులను కోరిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Sept 2026 7:35 AM IST
Guntur
X

Guntur: హరిశ్చంద్రాపురంలో భూసమీకరణ గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ

గుంటూరు: భూ సమీకరణ విధానాన్ని విజయవంతం చేసిన చరిత్ర అమరావతి రైతులదేనని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. అమరావతి రెండో విడత భూ సమీకరణలో భాగంగా తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం గ్రామంలో భూసమీకరణపై బుధవారం జరిగిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతిని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నగరంగా తీర్చిదిద్దుటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందుకుగాను రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. భూ సమీకరణకు అందరూ సహకరించాలని కోరారు. అమరావతి పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు.

రైతులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని హితవు పలికారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి అత్యాధునిక ప్రాజెక్టులు నెలకొల్పడం జరుగుతున్న విషయం తెలిసిందేనన్నారు. "అందరం కలిసి రాజధానిని అభివృద్ధి చేసుకుందామని" ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును గుర్తు చేశారు. రైతులు భూ సమీకరణకు భూములను అందిస్తే వెంటనే పనులను చేపట్టకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ ఏ.భార్గవ్ తేజ, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తహసిల్దార్ హరిబాబు, సి.ఆర్.డి.ఏ భూసమీకరణ డిప్యూటీ కలెక్టర్, స్థానిక అధికారులు, అనధికారులు, రైతులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN