Tadepalli: అలజడి సృష్టిస్తే ఊరుకోం.. వైసీపీకి అమరావతి రైతుల హెచ్చరిక!
Tadepalli: గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్‌ను అమరావతి రాజధాని రైతులు పరామర్శించారు.
తాడేపల్లి: వైసీపీ గుండాల చేతిలో గాయాల పాలై మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ ని పరామర్శించిన రాజధాని రైతులు..
కానిస్టేబుల్ కు ఆసుపత్రి నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తం కూడా తామే బరాయిస్తామని తెలియజేసిన రాజధాని రైతులు..
కానిస్టేబుల్ కి మెరుగైన వైద్యం అందించాలి ఎంత ఖర్చైనా పరవాలేదు అని మణిపాల్ హాస్పిటల్ డాక్టర్స్ ను కోరిన రాజధాని రైతులు..
రాజధాని అభివృద్ధి కోసం భూములు ఇస్తే, వైసిపి గుండాలు రాజధాని ప్రాంతం పరామర్శ పేరుతో తమపై రాళ్లతో, రాడ్లుతో దాడి చేశారు.. మహిళలపై కూడా దాడి చేయడం జరిగింది..
వైసీపీ నాయకులకు రాజధాని గ్రామాల్లో ఏం పని ,, ఈరోజు దాడి చేసిన వాళ్ళంతా కూడా వేరే వేరే ప్రాంతాలకు చెందిన రౌడీలను తీసుకొని రాజధాని గ్రామంలో వైసీపీ నాయకులు దాడికి ఎగబడ్డారు..
పరామర్శ పేరుతో విధ్వంసం సృష్టించటానికి వచ్చిన వైసీపీ నాయకులకి ఒక్కరికైనా సరే రాజధాని గ్రామాల్లో పొలాలు ఉన్నాయా అని ప్రశ్నించిన రాజధాని రైతులు..
గత వైసిపి ప్రభుత్వం కాలంలో అమరావతిని స్మశానం అని మాట్లాడుతూ అమరావతిని నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరల రాజధాని ప్రాంత అభివృద్ధి పనులను ప్రారంభించి పలు దేశాలలో నుంచి కంపెనీలు వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టే విధంగా అభివృద్ధి చేస్తున్నారు..
రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు రాజధానిని నాశనం చేయడానికి మరల ప్రయత్నిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం అయితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించే విధంగా ప్రవర్తిస్తే తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలియజేశారు..




