Ambati Rambabu: దాడి చేసిన వారిని 18 నిమిషాలైనా స్టేషన్‌లో ఉంచారా?
Ambati Rambabu:గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. తన నివాసంపై జరిగిన దాడిలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు.
Ambati Rambabu: దాడి చేసిన వారిని 18 నిమిషాలైనా స్టేషన్‌లో ఉంచారా?
Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరసన దీక్షకు దిగారు. తన ఇల్లు మరియు కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ఏకపక్షంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే తన నివాసంపై దాడి జరిగిందని, ఆ సమయంలో పోలీసులు మూగప్రేక్షకుల్లా నిలబడ్డారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని వదిలేసి, బాధితుడైన తనను మాత్రం 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం అన్యాయమని ఆయన ధ్వజమెత్తారు. "కేవలం 18 నిమిషాలైనా దాడి చేసిన నిందితులను పోలీస్ స్టేషన్‌లో ఉంచారా?" అని ఆయన ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసినందుకే తనను జైలుకు పంపారని అంబటి పేర్కొన్నారు. లోకేష్ డైరెక్షన్‌లో, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్లాన్ ప్రకారమే తనపై మరియు తన కుటుంబంపై దాడులు చేయించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ దీక్షకు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు హాజరై సంఘీభావం తెలుపుతున్నారు.




