Parchur: పర్చూరు ఏపీ జర్నలిస్టు ఫోరం నూతన కమిటీ ఎన్నిక!
Parchur: బాపట్ల జిల్లా పర్చూరులో ఏపీ జర్నలిస్టు ఫోరం నూతన కమిటీ ఎన్నికైంది. జర్నలిస్టుల పిల్లలకు ఇంటర్ వరకు ఫీజు రాయితీ వర్తింపజేయాలని కమిటీ డిమాండ్ చేసింది.
Parchur: పర్చూరు ఏపీ జర్నలిస్టు ఫోరం నూతన కమిటీ ఎన్నిక!
పర్చూరు: జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో ప్రకటించిన ఫీజు రాయితీని ఇంటర్మీడియట్ వరకు వర్తింపచేయాలని ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టు ఫోరం పర్చూరు నియోజకవర్గ కమిటీ కోరింది. స్థానిక రోటరీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం పర్చూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశంలో ఫోరం జిల్లా అధ్యక్షులు డి విజయభాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ కే ప్రభాకరరావు మాట్లాడారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన జర్నలిస్టులందరికీ వర్తింపచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పి శివ రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెళ్ళ వంశీకృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షులు జి కృష్ణాంజనేయులు సూచనల మేరకు పర్చూరు నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
జర్నలిస్ట్ ఫోరమ్ నియోజకవర్గ గౌరవాధ్యక్షులు జాన్ సుందరరావు, అధ్యక్షులు ఎన్ వి రామారావు (అక్షరభూమి, మార్టూరు), ఉపాధ్యక్షులు దండా రామకృష్ణ (99టివి, పర్చూరు), షేక్ మీరావాలి (స్వతంత్ర టివి, పర్చూరు), ఫరీద్ (బిగ్ టివి), ప్రధాన కార్యదర్శి షేక్ అమీన్ బాష (సిటీ న్యూస్), సహాయ కార్యదర్సులు గుమ్మడి హనుమంతరావు (యాద్దనపూడి, సాక్షి), రామకూరు అనిల్ (ఆంధ్రప్రభ, మార్టూరు), కె శివయ్య (వెలుగు, చిన్నగాంజాం), ట్రజరర్ షేక్ సుభాని (ప్రైమ్ 9, పర్చూరు), కార్యవర్గ సభ్యులు మోహనకృష (ఆంధ్రప్రభ, ఇంకొల్లు), కె విజయ (సత్తెనపల్లి న్యూస్, యద్దనపూడి), పి అయ్యన్న బాబు (గరుడ ప్రభ, మార్టూరు), వలివేటి శ్రీను (అమరావతి న్యూస్, పర్చూరు), బసవరాజు (వార్త, పర్చూరు), షేక్ బాష (హెచ్ఎం టివి, పర్చూరు), శ్రీకాంత్ (వార్త, చిన్నగంజాం), శ్రీనివాసరావు (కారంచేడు) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.




