Vinukonda: వినుకొండ ఘాట్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Vinukonda: వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు అభివృద్ధి పనులకు రూ.4 కోట్లతో శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 19 Jun 2026 3:45 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ ఘాట్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Vinukonda: వినుకొండ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు భక్తులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా రూపొందించబడ్డాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమైన మలుపులను సరిచేయడం, మార్గమధ్యంలో ఉన్న భారీ రాళ్లను తొలగించడం, రోడ్డును మరింత వెడల్పు చేయడం వంటి పనులు చేపట్టనున్నారు. దీంతో దేవాలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది.

ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని, నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే దేవాలయానికి వచ్చే భక్తుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story