Guntur: సాంకేతికతతో నేరాల కట్టడి: డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ ప్రారంభం!
Guntur: నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం: సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్, సేఫ్ స్టే యాప్‌ను ప్రారంభించిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా IPS.
Guntur: సాంకేతికతతో నేరాల కట్టడి: డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ ప్రారంభం!
గుంటూరు: నేరాల నియంత్రణ, పోలీసుల నిఘాను మరింత పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరిష్ కుమార్ గుప్తా IPS సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్‌తో పాటు సేఫ్ స్టే ఏపీ ప్రారంభించారు.
ఒకే పోర్టల్‌లో డ్రోన్ల పర్యవేక్షణ
సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా కోసం వినియోగిస్తున్న డ్రోన్ల సమాచారాన్ని ఒకే చోటు నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
పోలీసులు ప్రత్యక్షంగా చేరుకోలేని ప్రాంతాలకు సైతం డ్రోన్లు సులభంగా చేరుకుని నిఘా నిర్వహించగలవని గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. డ్రోన్ మానిటరింగ్ వ్యవస్థను జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేసినట్లు వెల్లడించారు.
ఈ పోర్టల్ ద్వారా ఒకేసారి 2,000 డ్రోన్లను పర్యవేక్షించే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. నేరాల నియంత్రణ, నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో డ్రోన్ టెక్నాలజీ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
హోటళ్ల సమాచారానికి ‘సేఫ్ స్టే ఏపీ’
హోటళ్లలో బస చేసే వ్యక్తుల వివరాలను పోలీసులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి సేఫ్ స్టే ఏపీ యాప్ నీ, రూపొందించినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ యాప్ ద్వారా నగరానికి వచ్చే వ్యక్తులు ఏ హోటల్‌లో బస చేస్తున్నారు అనే సమాచారాన్ని పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని రికార్డు రూపంలో సేకరించేవారని, ప్రస్తుతం యాప్ ద్వారా సమాచారాన్ని డిజిటల్ విధానంలో పోలీసులకు అందించవచ్చని తెలిపారు.
ప్రతి హోటల్ మేనేజ్‌మెంట్ సేఫ్ స్టే ఏపీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, హోటల్‌లో బస చేసే వారి వివరాలను అందులో నమోదు చేయాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే ప్రయాణికుల భద్రతకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఎస్పీ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో నేరాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.




