Guntur: స్థానిక ఎన్నికలకు ముందే సమగ్ర సన్నాహాలు: డీజీపీ హరీష్ గుప్తా
Guntur: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌కు ముందే సమగ్ర భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని పోలీస్ అధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు.
Guntur: స్థానిక ఎన్నికలకు ముందే సమగ్ర సన్నాహాలు: డీజీపీ హరీష్ గుప్తా
Guntur: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు ముందుగానే సమగ్ర సన్నాహాలు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.
సాధారణ పురపాలక ఎన్నికల నిర్వహణకు సంబంధించి సన్నాహక చర్యల్లో భాగంగా మంగళవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రాంతీయ సమాయత్త సమావేశం నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీపీ లా అండ్ ఆర్డర్ మధుసూదన్ రెడ్డి, ఐజీపీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, గుంటూరు రేంజ్ డీఐజీ ఫకీరప్ప, డీఐజీ లా అండ్ ఆర్డర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా 18 మండలాలు, 257 గ్రామపంచాయతీలు, 16 జడ్పీటీసీలు, 248 ఎంపీటీసీలు; పల్నాడు జిల్లా 28 మండలాలు, 525 గ్రామపంచాయతీలు, 434 ఎంపీటీసీలు, 28 జడ్పీటీసీలు; బాపట్ల జిల్లా 20 మండలాలు, 346 గ్రామపంచాయతీలు, 20 జడ్పీటీసీలు, 297 ఎంపీటీసీలు, 3 మున్సిపాలిటీలు; ప్రకాశం జిల్లా 516 గ్రామపంచాయతీలు, 27 జడ్పీటీసీలు, 377 ఎంపీటీసీలు, 5 మున్సిపాలిటీలు; మార్కాపురం జిల్లా 46 గ్రామపంచాయతీలు, 21 జడ్పీటీసీలు, 275 ఎంపీటీసీలు; నెల్లూరు జిల్లా 976 గ్రామపంచాయతీలు, 6 మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉన్నందున, నోటిఫికేషన్‌కు ముందే అవసరమైన పనులను పూర్తి చేసుకుంటే ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించవచ్చని డీజీపీ తెలిపారు. రాజ్యాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎన్నికల నిర్వహణ జరగాలని డీజీపీ గారు స్పష్టం చేశారు.
*పోలీస్ అధికారులు చేపట్టాల్సిన ప్రధాన చర్యలు గురించి డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.
శాంతిభద్రతలు – ముందస్తు నివారణ చర్యలు:
- గత ఎన్నికల్లో ఘర్షణలు, వివాదాలు చోటుచేసుకున్న ప్రాంతాలను గుర్తించి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించాలి. డీఎస్పీ స్థాయి అధికారులు హైపర్ సెన్సిటివ్ గ్రామాలను పరిశీలించి, వాటి సమస్యలను పూర్తిగా తెలుసుకోవాలి.
- సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి.
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన ముందస్తు నివారణ చర్యలు, బైండ్‌ఓవర్ ప్రొసీడింగ్స్ చేపట్టాలి.
- బైండ్‌ఓవర్‌ను పెద్ద మొత్తంలో, రూ.10 లక్షల వరకు చేయించాలి.
- నాటుసారా, అక్రమ మద్యం, నగదు పంపిణీ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేయాలి.
- ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇంతకుముందు 2021, 2024 సంవత్సరాల్లో నమోదైన కేసుల పురోగతిని పరిశీలించి, వాటిపై తగు చర్యలు తీసుకోవాలి.
పోలింగ్ కేంద్రాల భద్రత:
- పోలింగ్ కేంద్రాలను సాధారణ, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్‌గా వర్గీకరించి, వాటి ప్రాధాన్యతకు అనుగుణంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలి.
- ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, భద్రతాపరమైన లోపాలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలి.
- రూట్ మొబైల్స్, మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసి సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర గస్తీ నిర్వహించాలి.
- అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధంగా ఉంచాలి.
బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల భద్రత:
- బ్యాలెట్ బాక్సుల రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి.
- స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.
- భద్రతా విధుల్లో ఉన్న సిబ్బందికి వారి బాధ్యతలు, విధులపై స్పష్టమైన అవగాహన కల్పించాలి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి:
- లైసెన్స్ కలిగిన ఆయుధాలను నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయించే ప్రక్రియను పూర్తి చేయాలి.
- ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలి.
- అనుమతి లేని సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.
అంతర్‌శాఖల సమన్వయం:
- రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగించాలి.
- అత్యవసర సమాచార మార్పిడికి వైర్‌లెస్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలి.
- ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల అనంతరం చేపట్టాల్సిన పోలీస్ విధులపై అధికారులకు స్పష్టమైన అవగాహన కల్పించాలి.
మధుసూదన్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ ఐజీపీ
ఎన్నికల గురించి ముఖ్యమైన సూచనలు, సలహాలను జిల్లా ఎస్పీలకు ఇచ్చారు.
గుంటూరు ఐజీపీ సర్వ శ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ
పోలీస్ స్టేషన్ పరిధిలో గొడవలు జరిగే ప్రాంతాలను గుర్తించాలి. పార్టీలలో ఎవరు గొడవలకు పాల్పడతారు, ఎవరు వాటిని సోషల్ మీడియాలోకి పంపిస్తారు అనే విషయాలను గమనించాలి.
గ్రామాల్లో కార్డన్ సెర్చ్‌లు నిర్వహించి, అక్రమ ఆయుధాలను గుర్తించాలి.
ట్రబుల్ ట్రబుల్‌ను గుర్తించి, వారిని పది లక్షల వరకు బైండ్‌ఓవర్ చేయాలి. ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా చేయాలి.
ఎలక్షన్ నోటిఫికేషన్‌కు ముందే సిద్ధంగా ఉండాలి. ప్రజల కోసం బాగా పనిచేయాలి.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం తక్కువ సమయంలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉండే అవకాశం ఉన్నందున, పోలీస్ అధికారులు ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.
బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల రవాణా, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, కౌంటింగ్ కేంద్రాల వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని, వారితో పోలీస్ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని అన్నారు.
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
ఎన్నికల సమయంలో పత్రికలు, సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే తప్పుడు వార్తలు, వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు, మత, వర్గ విద్వేషాలకు దారితీసే ప్రచారంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ తెలిపారు.
తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా సైబర్ విభాగం నిరంతరం పర్యవేక్షించాలని, ఏదైనా వదంతి లేదా తప్పుడు ప్రచారం వెలువడిన వెంటనే వాస్తవాలను ప్రజలకు తెలియజేసి స్పష్టత ఇవ్వాలని సూచించారు.
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ తరఫున ప్రజల్లో భరోసా కల్పించాలని అన్నారు.
ఓటర్ల జాబితాను అనుసరించి అన్ని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో గుర్తించి ముందస్తు తనిఖీలు చేపట్టాలని అన్నారు.
నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు Model Code of Conduct, Green Codeలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
మాట్లాడుతూ
జిల్లాలోని పరిస్థితిని డీజీపీకి వివరించారు
ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ మరియు ఎన్నికల అధికారుల మధ్య సమన్వయం అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ముందస్తు చర్యలను పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మార్క్పురం జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు.




