Vinukonda: కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం.. చీఫ్ విప్ జీవీ

Vinukonda: విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇనుమెళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తల అంతిమయాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ.

KAREEMULLA, VINUKONDA
Published on: 20 July 2026 1:09 PM IST
Vinukonda
X

Vinukonda: కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం.. చీఫ్ విప్ జీవీ

Vinukonda: విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇనుమెళ్ల గ్రామానికి చెందిన పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి భవాని శంకర్ భౌతికకాయాలకు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి తనతో ఎంతో సన్నిహితంగా ఉన్న రామాంజనేయులు, మీరావలి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజాసేవలో ముందుండేవారని గుర్తుచేశారు. వారి అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కలిసి మృతుల అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ విషాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జీవీ ఆంజనేయులు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story