Guntur: గుంటూరు ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే చర్యలు

Guntur: గుంటూరు నగరపాలక సంస్థలో ఆర్టీఐ సెక్షన్ 4 (1)బి అమలును పరిశీలించిన ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిపై హెచ్చరిక.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 10 July 2026 6:32 PM IST
Guntur
X

Guntur: గుంటూరు ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే చర్యలు

గుంటూరు: ఆర్టీఐ చట్టం ప్రభుత్వ పారదర్శక పాలనను ప్రజలకు తెలియడానికి రూపొందించిన చట్టమమని, చట్ట ప్రకారం ప్రభుత్వ అధికారులు నిర్దేశిత సమాచారం గడువులోగా ఇవ్వాలని, చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సిటిజన్ చార్టర్, అధికారుల వివరాలతో కూడిన బోర్డ్ లను పరిశీలించి, ఆర్టీఐ చట్టం సెక్షన్ 4 (1)బి ప్రకారం రిజిస్టర్ల నిర్వహణపై పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అప్పీలేట్ అధారిటీ అధికారులతో సమీక్షించి, రిజిస్టర్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత ఆర్టీసి కాలనీలోని వార్డ్ సచివాలయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ మాట్లాడుతూ, శుక్రవారం ఆర్టీఐ కమిషనర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ చట్టం 4 (1)బి సెక్షన్ అమలుని నేరుగా పరిశీలించారన్నారు. విజయవాడ, గుంటూరుల్లో తాము పరిశీలించామని, అందులో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో రిజిస్టర్లు, అనెగ్జలరీలు నిర్వహణ, చట్ట అమలు సంతృప్తికరంగా ఉందన్నారు.

అలాగే వార్డ్ సచివాలయాల్లో కూడా పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన ప్రజలకు తెలిసేందుకు ఏర్పడిన చట్టాని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు కూడా చట్టపరంగా అర్జీలకు ఇవ్వాల్సిన సమాచారం నిర్దేశిత గడువుకి ముందే ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని శాఖలు, విభాగాల్లో లోపాలు గుర్తించామని, ప్రభుత్వ అధికారులు కూడా సహకరించాలన్నారు. చట్టంపై ప్రభుత్వ కార్యాలయాల పిఐఓలకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్గిస్తామని తెలిపారు.

అలాగే సమాజానికి మేలు చేసేలా ఉండే సమాచారాన్ని కోరే వారికి గడువులోగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, అలా కాకుండా కొందరు చట్టాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను ఇబ్బంది పెట్టడం, అమాయక ప్రజలను ఆర్ధికంగా ఇబ్బంది పెడుతూ దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించామని, అటువంటి వారిపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఈఈ విష్ణు, మేనేజర్ బాలాజి బాష, పిఐఓలు, అప్పీలేట్ అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story