Amaravati: సమగ్ర శిక్ష ఉద్యోగుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి APCRPWA

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు 2 నెలలుగా నిలిచిపోయిన వేతనాలను తక్షణమే విడుదల చేయాలని APCRPWA రాష్ట్ర కన్వీనర్ తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్.

Madhav Goud, Nellore
Published on: 2 Aug 2026 1:29 PM IST
Amaravati
X

Amaravati: సమగ్ర శిక్ష ఉద్యోగుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి APCRPWA

వేతనాలు విడుదల చేయాలని సిఆర్ పి రాష్ట్ర కన్వీనర్ తుమ్మల నాగేశ్వర రావు...

సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి APCRPWA రాష్ట్ర కన్వీనర్ తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 23 వేల మంది ఉద్యోగులు గత రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు, ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వెన్నెముకగా పనిచేస్తున్న సిఆర్పి ఉద్యోగులు తమ కుటుంబాల జీవనోపాధి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొనడం అత్యంత బాధాకరమని తెలిపారు,

ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని కేవలం పరిపాలనా సమస్యగా కాకుండా 23 వేల కుటుంబాల జీవనాధారానికి సంబంధించిన సమస్యగా గుర్తించి వెంటనే స్పందించాలని కోరారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story