Vinukonda: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటన
Vinukonda: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినూత్న శైలిలో వినుకొండ నుండి ఈపూరు మండలం కొండ్రముట్లపాలెం వరకు 10 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణించారు.
Vinukonda: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటన
Vinukonda: వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి.ఆంజనేయులు వినూత్న శైలిలో ప్రజల్లోకి వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన విలాసవంతమైన కార్ల వినియోగాన్ని తగ్గించి సైకిల్,పర్యావరణహిత ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వినియోగిస్తున్నారు.
వినుకొండ పట్టణంలోని తన నివాసం నుంచి ఈపూరు మండలం కొండ్రముట్లపాలెం గ్రామం వరకు సుమారు 10 కిలోమీటర్ల దూరాన్ని స్వయంగా సైకిల్, స్కూటర్‌పై ప్రయాణించారు. గ్రామానికి చేరుకున్న అనంతరం రూ.2.05 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న తారు రోడ్డు పనులను పరిశీలించి,
పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చీఫ్ విప్ సాధారణ వ్యక్తిలా స్కూటర్‌పై ప్రయాణించడాన్ని చూసిన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు.




