Tadepalli: చంద్రబాబు ప్రభుత్వంపై వెంకట్రామిరెడ్డి ఫైర్!

Tadepalli: కూటమి ప్రభుత్వంపై ఏపీజీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఐఆర్, పీఆర్సీ బకాయిలపై మండిపాటు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 13 July 2026 12:40 PM IST
Tadepalli
X

Tadepalli: చంద్రబాబు ప్రభుత్వంపై వెంకట్రామిరెడ్డి ఫైర్!

Tadepalli: చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను క్షవరం చేసింది

అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక్క హామీని కూడా అమలు చేయలేదు

ఈ రెండేళ్లుగా పీఆర్సీ, డీఏ, ఐఆర్ వలన రూ.32 వేల కోట్లు నష్టపోయాం

పాత బకాయిలు కూడా కలిపితే రూ.50 వేల కోట్లు దాటుతుంది

ఉద్యోగులకు ఈ స్థాయిలో బకాయిలు పెట్టిన చరిత్ర చంద్రబాబుది

టార్చర్ తట్టుకోలేక గత నెలలోనే పది మంది ఉద్యోగులు చనిపోయారు

ఇంకా ఎంతమంది ఉద్యోగులను బలి తీసుకుంటారు?

ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా?

అధికారంలోకి వచ్చాకొక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదు?

ఉద్యోగులను ఎండబెట్టి అమరావతిలో అద్దాలకే రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తారా?

ఇది తుగ్లక్ పాలన కాదా?

చంద్రబాబు హామీలు నమ్మి ఉద్యోగులంతా ఎగబడి మరీ కూటమికి ఓటేశాం

కానీవాధికారంలోకి వచ్చాక అందరికీ బోడిగుండు కొట్టారు

ఉద్యోగులకు రూ.32 వేల కోట్లను క్షవరం చేశారు

అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని ఎగ్గొట్టారు

సరెండర్ లీవులు రెండు చొప్పున పెండింగ్

పోలీసులకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్

ఒక్కో ఉద్యోగి రూ.5లక్షలకు పైనే నష్టం జరిగింది

చివరికి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రూ.2 లక్షలకు పైనే నష్టం

పాత బకాయిలు కూడా కలుపుకుంటే రూ.50 వేల కోట్లకు బకాయిలు చేరాయి

ఉద్యోగులకు ఎన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నాయో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి

గత జూన్ నెలలోనే 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు

అంటే ఏ స్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు

సర్ ప్రోగ్రామ్ ఐతే మరీ టార్చర్ గా మారింది

పని చేయకపోతే తన్నమని కలెక్టర్లు అంటున్నారు

ఇదేనా ఉద్యోగులతో పని చేయించుకోవటం?

స్కూల్ తెరిచి నెల దాటినా టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పలేదు

వారితో పేరంట్స్ మొబైల్ లో లీప్ యాప్ ని డౌన్ లోడ్ చేయిస్తున్నారు

అసలు ఉద్యోగులతో పని చేయనీయకుండా వేధిస్తారా?

ఇంత జరుగుతున్నా మిగతా ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి?

ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చున్నారా?

ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబుకు పట్టదా?

ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా మేలుకోవాలి.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA

Next Story