Takkelapadu: తక్కెళ్లపాడు ప్యాకేజింగ్స్ పరిశ్రమను తనిఖీ చేసిన ఏపీపీసీబీ ఛైర్మన్ పి. కృష్ణయ్య!
Takkelapadu: గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులోని జయరాజ్ ఫార్చ్యూన్ ప్యాకేజింగ్స్ పరిశ్రమను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి. కృష్ణయ్య తనిఖీ చేశారు.
Takkelapadu: తక్కెళ్లపాడు ప్యాకేజింగ్స్ పరిశ్రమను తనిఖీ చేసిన ఏపీపీసీబీ ఛైర్మన్ పి. కృష్ణయ్య!
Takkelapadu: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఛైర్మన్ పి. కృష్ణయ్య, ఐఏఎస్ (రిటైర్డ్) ఈ రోజు గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, తక్కెళ్లపాడు గ్రామంలోని జయరాజ్ ఫార్చ్యూన్ ప్యాకేజింగ్స్ పరిశ్రమను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో APPCB ప్రాంతీయ కార్యాలయం, గుంటూరు ప్రాంతీయ పర్యావరణ ఇంజినీర్ ఎం.డి. నజీనా బేగం , ప్రాంతీయ కార్యాలయ అధికారులు మరియు పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ పరిశ్రమ ప్రాంగణాన్ని పరిశీలించి, ముడి పదార్థాల వినియోగం, Corrugated Boxes తయారీ ప్రక్రియకు సంబంధించిన కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం పరిశ్రమలో ఏర్పాటు చేసిన Effluent Treatment Plant (ETP), బాయిలర్ నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణ వ్యవస్థలు, ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాంతీయ పర్యావరణ ఇంజినీర్ ఎం.డి. నజీనా బేగం పరిశ్రమలో అమలవుతున్న తయారీ ప్రక్రియలు, కాలుష్య నియంత్రణ పరికరాల పనితీరు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనుసరిస్తున్న చర్యల గురించి ఛైర్మన్ కి వివరించారు. ఛైర్మన్ సంబంధిత అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశ్రమ కార్యకలాపాలు వర్తించే పర్యావరణ ప్రమాణాలు మరియు కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలను సమీక్షించారు.




