Tadepalli: ఎన్‌టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు దరఖాస్తులు!

Tadepalli: తాడేపల్లి కార్పొరేషన్‌లో ఎన్‌టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు దరఖాస్తులు ప్రారంభం. సెప్టెంబర్ 16లోపు సచివాలయాల్లో అప్లై చేయాలని కమిషనర్ అలీం బాషా వెల్లడి.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 8 Sept 2026 9:32 AM IST
Tadepalli
X

Tadepalli: ఎన్‌టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు దరఖాస్తులు!

Tadepalli: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన ప్రజలకు ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు కమిషనర్‌ అలీం బాషా తెలిపారు.

సెప్టెంబర్‌ 7 నుంచి 16వ తేదీ వరకు కొత్త పింఛన్ల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.వృద్ధాప్య, వితంతువు, చేనేత, వికలాంగులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీలకు చెందిన అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దరఖాస్తుదారులు ఆధార్‌ కార్డు, రైస్‌ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత పింఛను కేటగిరీకి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలన్నారు.

అర్హులు తమ పరిధిలోని వార్డు సచివాలయంలో స్వర్ణ వార్డు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ (డబ్ల్యూడీఎస్‌)ను సంప్రదించి సెప్టెంబర్‌ 16వ తేదీలోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని అలీం బాషా సూచించారు.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI