Bapatla: దేవ వరప్రసాద్‌కు కీలక బాధ్యతలు బాపట్ల పగ్గాలు అప్పగించిన పవన్
Bapatla: జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ నిర్మాణ సారథుల సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు బాపట్ల నియోజకవర్గ బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించారు
Bapatla: దేవ వరప్రసాద్‌కు కీలక బాధ్యతలు బాపట్ల పగ్గాలు అప్పగించిన పవన్
బాపట్ల: మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యాచరణ సమావేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను రాజోలు ఎమ్మెల్యే Deva Varaprasadకు పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan అప్పగించారు.
పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో దేవ వరప్రసాద్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ బాపట్ల పార్లమెంటు పరిధిలో జనసేనను మరింత బలోపేతం చేస్తానని దేవ వరప్రసాద్ స్పష్టం చేశారు.
"పార్టీ నమ్మకాన్ని నిలబెడతా.. బాపట్లలో జనసేన జెండా మరింత ఎగరవేస్తా" అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.




