Mangalagiri: ఐజీపీ రాజకుమారి గొప్ప మనసు.. క్యాన్సర్ బాలుడికి రూ. 13 లక్షల సాయం!

Mangalagiri: ఏపీఎస్పీ ఐజీపీ రాజకుమారి మానవత్వం. క్యాన్సర్ బాధితుడైన బెటాలియన్ ఉద్యోగి కుమారుడి చికిత్స కోసం రూ. 12.96 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసిన ఐజీపీ.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI
Published on: 23 Jun 2026 12:06 PM IST
Mangalagiri
X

Mangalagiri: ఐజీపీ రాజకుమారి గొప్ప మనసు.. క్యాన్సర్ బాలుడికి రూ. 13 లక్షల సాయం!

మంగళగిరి: ఏపీఎస్పీ ఐజీపీ రాజకుమారి మానవత్వాన్ని చాటుకున్నారు. బెటాలియన్ లో పనిచేసే ఉద్యోగి డీసీహెచ్ కాంతారావు కుమారుడు గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ఎస్పీ ఐజీపీ రాజకుమారి మానవత్వం తో స్పందించారు.

అనుకున్నదే తడవుగా ఆమె అన్ని పోలీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా క్షతగాత్రుడి వైద్య చికిత్స నిమిత్తం రూ.12,96,999 ల ఆర్థిక సహాయాన్ని సేకరింపజేసి ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో సోమవారం బాధితుని తండ్రి కాంతారావుకు అందజేశారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

Next Story