Bapatla: సర్కార్ ఎక్స్ ప్రెస్ లో చోరీకి ప్రయత్నించిన దోపిడి దొంగలు

Bapatla: సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి యత్నించిన దొంగలు. బాపట్ల-అప్పికట్ల మధ్య ప్రయాణికులపై దాడి.

B SURESH, BAPATLA
Published on: 15 Jun 2026 10:06 AM IST
Bapatla
X

Bapatla: సర్కార్ ఎక్స్ ప్రెస్ లో చోరీకి ప్రయత్నించిన దోపిడి దొంగలు

బాపట్ల జిల్లా:సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. బాపట్ల - అప్పికట్ల రైల్వే స్టేషన్ల మధ్య అర్థరాత్రి వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.

రైలులోని S3, S6 భోగీలలోకి ప్రవేశించిన దుండగులు ప్రయాణికుల బ్యాగులను దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఒక మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు యత్నించగా, ఆమె పెద్దపెట్టున కేకలు వేసింది. దీంతో రైలులో ఉన్న జీఆర్పీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారు పోలీసులపైకి రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి గాలిలోకి 9 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల ప్రతిఘటనతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలంలో దోచుకున్న రెండు బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటనా స్థలాన్ని జీఆర్పీ ఎస్పీ షణ్ముఖ వడివేలు, డీఎస్పీ అక్కేశ్వరరావు పరిశీలించారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు.

B SURESH, BAPATLA

B SURESH, BAPATLA

Next Story