Bapatla: ఆక్వా రైతు ఇంట దాడి కేసు ఛేదనం - ముగ్గురు నిందితుల అరెస్ట్

Bapatla: వేటపాలెంలో ఆక్వా రైతు లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి కేసును చీరాల టూ టౌన్ పోలీసులు ఛేదించారు. భూ వివాదం కారణంగా సుపారీ ఇచ్చి దాడి చేయించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 1 Sept 2026 8:37 PM IST
Bapatla
X

Bapatla: ఆక్వా రైతు ఇంట దాడి కేసు ఛేదనం - ముగ్గురు నిందితుల అరెస్ట్

బాపట్ల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో ఆక్వా రైతు చెరుకూరి లక్ష్మీనారాయణ ఇంటిపై మాస్క్‌లు ధరించి కర్రలతో దాడి చేసి.. ఇంటి అద్దాలతో పాటు కారును ధ్వంసం చేసిన కేసును చీరాల టూ టౌన్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.

ఈ కేసులో దాడికి ప్రేరేపించిన పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, కర్రలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎం.డి. మొయిన్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అక్కాయిపాలెంలో నాలుగు ఎకరాల 50 సెంట్ల వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో కొండ్రు శ్రీనివాసరావు, చెరుకూరి లక్ష్మీనారాయణ మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని చెప్పారు.

ఈ నేపథ్యంలో కొండ్రు శ్రీనివాసరావు.. పద్మారావు, విజయ్‌కుమార్‌కు నగదు సుపారీ ఇచ్చి లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ఎం.డి. మొయిన్ వెల్లడించారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story