Bapatla: కొల్లవారిపాలెంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ.. ఎమ్మెల్యే హాజరు
Bapatla: బాపట్ల జిల్లా పర్చూరు మండలం కొల్లవారిపాలెంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. ప్రవాసాంధ్రుడు అశోక్ కొల్ల ఆధ్వర్యంలో వేడుక, ఎమ్మెల్యే ఏలూరి హాజరు.
Bapatla: కొల్లవారిపాలెంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ.. ఎమ్మెల్యే హాజరు
బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు మండలం కొల్లవారిపాలెంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. కొల్లవారి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు అశోక్ కొల్ల ఆధ్వర్యంలో తమ స్వగ్రామమైన కొల్లవారిపాలెంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్న తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని పరిచయం చేయడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో జరిగే వైభవమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను స్వగ్రామ ప్రజలకు కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి lసాంబశివరావు ప్రత్యేక పూజల్లో పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పర్చూరు మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొల్లవారి కళ్యాణ మండపం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది.




