Bapatla: టీచర్లపై దాడులు హేయమైన చర్య: పీవీఎన్ మాధవ్!
Bapatla: బాపట్ల జిల్లా చీరాలలో బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ పర్యటించారు. టీచర్లపై దాడులు హేయమైన చర్య అని పేర్కొంటూ, అల్లర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bapatla: టీచర్లపై దాడులు హేయమైన చర్య: పీవీఎన్ మాధవ్!
Bapatla: గురువులపై రౌడీ మూకలు దాడిచేయడం హేయమైన చర్య అని..వీరిని కఠినంగా శిక్షించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించిన ఆయన ఈపూరుపాలెం జడ్పీ హైస్కూల్లో సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
దేశంలో టీచర్లపై దాడులు చేసిన చరిత్ర ఎప్పుడూ లేదని మాధవ్ అన్నారు. అవకతవకలు పేరుతో వైసీపీ పార్టీ చేస్తున్న అల్లర్లు, దాడులతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. డీఎస్సీపై జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న విధానం సరైనది కాదని..టీచర్లుపై దుర్భాషలాడుతూ దాడులకు తెగబడటం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.
అసలు డీఎస్సీలో అవకతవకలు జరిగాయని భావిస్తే న్యాయస్థానాలకు వెళితే సరిపోతుందని..సవాళ్లు ప్రతి సవాళ్లు అవసరం లేదని మాధవ్ స్పష్టం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలంగా తయారైందని..బలమైన లీడర్ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మాధవ్ తెలిపారు.




