Bapatla: బాపట్లలో రోడ్డెక్కిన చిన్న బొట్లవారిపాలెం గ్రామస్తులు!
Bapatla: బాపట్ల జిల్లా చిన్న బొట్లవారిపాలెం గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని గ్రామస్తులు ధర్నా. చీరాల, చిలకలూరిపేట, నరసరావుపేట ఆర్టీసీ డిపోలకు డిమాండ్.
Bapatla: బాపట్లలో రోడ్డెక్కిన చిన్న బొట్లవారిపాలెం గ్రామస్తులు!
Bapatla: బాపట్ల జిల్లా చిన్న బొట్లవారిపాలెం గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హైవే నిర్మాణం తర్వాత చీరాల, చిలకలూరిపేట, నరసరావుపేట డిపోల పరిధిలోని ఏ బస్సు కూడా గ్రామంలో ఆగడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, కూలీలతో పాటు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వాయిస్ ఓవర్:
బాపట్ల జిల్లా చిన్న బొట్లవారిపాలెం గ్రామంలో బస్సులు నిలిపివేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై నిరసన చేపట్టారు. గతంలో గ్రామంలో అన్ని డిపోల ఆర్టీసీ బస్సులు ఆగేవని, హైవే నిర్మాణం అనంతరం బస్సులు తిమ్మరాజుపాలెం వద్ద మాత్రమే ఆగుతున్నాయని తెలిపారు.
దీంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, రోజువారీ కూలీలు పనులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో బస్సులు ఆగకపోవడంతో ప్రతిరోజూ అదనపు దూరం నడవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించడంతో పాటు చీరాల, చిలకలూరిపేట, నరసరావుపేట డిపో మేనేజర్లకు కూడా పలుమార్లు దరఖాస్తులు ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
చిన్న బొట్లవారిపాలెం వద్ద అన్ని డిపోల ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా ఆగేలా సంబంధిత అధికారులు, డిపో మేనేజర్లు డ్రైవర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.




