Chirala: చీరాలలో ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు.. స్థానికంగా కలకలం!
Chirala: బాపట్ల జిల్లా చీరాల పేరాల శివాలయం సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తులు సీసీ కెమెరా ధ్వంసం చేసి ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Chirala: చీరాలలో ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు.. స్థానికంగా కలకలం!
చీరాల: బాపట్ల జిల్లా చీరాల పేరాల శివాలయం సెంటర్లో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఆంజనేయ స్వామి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెల్లవారుజామున ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులు.. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేసి, అనంతరం విగ్రహానికి నిప్పు పెట్టినట్లు సమాచారం.
ఈ ఘటనతో స్థానికులు భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న చీరాల టూ టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
ఆంజనేయ స్వామి విగ్రహంపై జరిగిన ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు. పోలీసులు విచారణలో భాగంగా చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలించగా అనుమానితుడు ఆచూకీ తెలియడంతో విచారణకు తీసుకువెళ్లిన టూ టౌన్ పోలీసులు.




