Chirala: చీరాల నియోజకవర్గంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు ఏకగ్రీవం!
Chirala: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Chirala: చీరాల నియోజకవర్గంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు ఏకగ్రీవం!
చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.చీరాల, వేటపాలెం మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు జరిగిన ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చీరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా సిద్ధి సునీత దేవంగపూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా వైస్ ఎంపీపీగా అసాది రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మరోవైపు వేటపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఎంపీపీగా ఎర్రంశెట్టి కోమలి, వైస్ ఎంపీపీగా పులి హరికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చీరాల నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాల్లో మొత్తం 45 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా, తాజాగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు కూడా ముగియడంతో మండల పరిషత్‌లకు నాయకత్వం ఖరారైంది.




