Bapatla: పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్!

Bapatla: బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేరాలలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించి, ఓటర్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 26 Aug 2026 9:53 AM IST
Bapatla
X

Bapatla: పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్!

Bapatla: మంగళవారం, చీరాల మండలం, పేరాలలోని హరిప్రసాద్ నగర్ నందు గల ఆర్కే ఓరియంటల్ స్కూల్ లోని 95వ పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లో ఏర్పాటుచేసిన ఓటర్ జాబితాను ఆయన పరిశీలించారు.

పోలింగ్ స్టేషన్ పరిధిలో గైర్హాజరు, ఇల్లు మారటం, మరణాల జాబితా, నోటీసుల జారీ, హియరింగ్ దరఖాస్తుల పై ఆయన బి.ఎల్.వో ను ఆరా తీశారు. హియరింగ్ ప్రక్రియను ఒక ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏఇఆర్ఓ కు మరియు బిఎల్ఓ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహారావు, తహసిల్దార్ గోపికృష్ణ,మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్ , ఎ ఈ ఆర్ ఓ రఘురాం , బి ఎల్ వో ఆమని మరియు తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story