Repalle: 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' అధికారులపై కలెక్టర్ ఆగ్రహం!

Repalle: రేపల్లె నియోజకవర్గంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయి పీజీఆర్‌ఎస్. గడువులోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశాలు.

VIJAYA KISHORE, REPALLE
Published on: 17 July 2026 4:00 PM IST
Repalle
X

Repalle: 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' అధికారులపై కలెక్టర్ ఆగ్రహం!

Repalle: పిజిఆర్ఎస్ లో అర్జీదారులు అందజేసే ప్రతి అర్జీని నిర్ణిత గడువులోగా అర్జీకి పరిష్కరం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక నెల,ఒక నియోజకవర్గం,నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం, రేపల్లె నియోజకవర్గం, రేపల్లె మండలంలో, ఇసుకపల్లి గ్రామంలోని శ్రీ భ్రమరాంబ చెన్న మల్లేశ్వర స్వామి వారి పురాణ కాలక్షేప మండపంలో నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని మండలాల ప్రజలు సమస్యలతో వచ్చిన ప్రత్యేక పి జి ఆర్ ఎస్ కు నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలకు సంబంధించి 60 మంది అర్జీదారులు తమ సమస్యల ను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించుకునేందుకు వచ్చిన అర్జీదారులు నుంచి వినతిపత్రాల ను కలెక్టర్ కు స్వీకరించి తన పరిధిలో ఉన్న వాటికి కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపుతూ మరికొన్నిటిని సంబంధిత శాఖల కు అధికారులకు అందజేసి వెంటనే పరిశీలించి పరిష్కరం చేయాలని అధికారులను ఆదేశించారు.

గడువు తీరకముందే పీజీఆర్ఎస్ లో నమోదైన అర్జీలను పరిష్కరించాలని ఆన్ లైన్ లో నమోదైన అర్జీలను కొన్ని శాఖల అధికారుల వద్ద అర్జీలు పెండింగ్ లో ఉండడంపై పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్, ఎస్ డి సి లవన్న, ఆర్డీఓ

బి.శ్రీదేవి,మున్సిపల్ కమిషనర్. సాంబశివరావు, డి యం & హెచ్ ఓ.డాక్టర్ఎస్.విజయమ్మ, డి పి ఓ.యల్.ప్రభాకర్ రావు, సి పి ఓ.ఏ.ఎస్.రాజు, పి డి లు, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బి.సింగయ్య, విజయలక్ష్మి, వెంకటేశ్వర రావు,రాధమాదవి,డి ఈ ఓ.శ్రీనివాస్, మార్క్ పేడ్ డి యం.కరుణశ్రీ, డి సి హెచ్ ఎస్.పద్మావతి, డి టి సి. పరందామ రెడ్డి,జి యం.డి ఐ సి.రామకృష్ణ, జిల్లా ఖజానా అధికారిణి పద్మావతి,జిల్లా పౌర సరఫరాల శాఖ డి ఎస్ ఓ.జగన్మోహన్, డి యం.శ్రీ లక్ష్మి, ,బి.సి. శాఖల అధికారులు శివలీల,డి ఎఫ్ ఓ.రవిశంకర్, సాంఘిక సంక్షేమ శాఖ డి డి రాజా దేబోరా, డి ఈ ఓ.శ్రీనివాస్,జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారిణి మాధవి, మత్స్య శాఖ ఏ డి గాలిదేవుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE

Next Story