Chirala: చీరాలలో అక్రమ రేషన్ నిల్వలపై అధికారుల మెరుపు దాడులు
Chirala: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో సివిల్ సప్లై అధికారులు జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది.
Chirala: చీరాలలో అక్రమ రేషన్ నిల్వలపై అధికారుల మెరుపు దాడులు
Chirala: బాపట్ల జిల్లాచీరాలలో రేషన్ షాపులపై అధికారుల దాడులు నిర్వహించారు. రాబడిన సమాచారం మేరకు జిల్లా సివిల్ సప్లై అధికారి జగన్ మోహన్ రావు, డీటీ ఓంకార్., సిబ్బంది విజయలక్ష్మిపురంలో షాప్ నెంబర్ 19లో అక్రమ రేషన్ నిల్వలు, బియ్యం తరలించే వాహనాన్ని గుర్తించి 56 రేషన్ బియ్యం బస్తాలు సీజ్ చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
షాపు నిర్వాహకురాలు శారదాపై 6ఏ కేసు నమోదు చేశారు. రేషన్ అక్రమ తరలింపును అడ్డుకొని చర్యలు తీసుకున్నామని సివిల్ సప్లై జిల్లా అధికారి జగన్ మోహన్ రావు తెలిపారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని కస్టోడిఎస్ కుతరలించనున్నట్లు తెలిపారు. ఎవరైనా రేషన్ కార్డు దారులకు డబ్బులు చెల్లించి బియ్యాన్ని నిల్వచేసిన క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story




