Bapatla: విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు: బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వ!
Bapatla: బాపట్ల జిల్లాలో 5 కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు.
Bapatla: విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు: బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వ!
బాపట్ల: జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ గారు స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఐదు కేంద్రాల్లో నిర్వహించారు.
ఐదు కౌంటింగ్ కేంద్రాల వద్ద 500 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, చీరాలలోని చీరాల ఇంజనీరింగ్ కళాశాల, వేటపాలెంలోని సెంటెన్స్ ఇంజనీరింగ్ కళాశాల, రేపల్లెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఏబీఆర్ డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ భద్రత నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది.
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడానికి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో స్థానిక పోలీసులతో పాటు 134 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో 31 పికెట్లు, 22 పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.




