Bapatla: బాపట్లలో అన్నం సతీష్ ప్రభాకర్ జోరుగా ఎన్నికల ప్రచారం
Bapatla: బాపట్ల స్థానిక ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ దూసుకుపోతున్నారు; పోలీసు సోదాలు, అభివృద్ధి ప్రశ్నలతో వ్యాఖ్యలు.
Bapatla: బాపట్లలో అన్నం సతీష్ ప్రభాకర్ జోరుగా ఎన్నికల ప్రచారం
బాపట్ల: బాపట్లలో రసవత్తరమైన పోరు మొదలైంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇరు పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాలలో దూసుకుపోతున్నారు. గెలుపు మాదంటే మాదని వైకాపా టిడిపి నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా బాపట్లలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఎన్నికల సెగని బాపట్లలో పుట్టించారు.
రాష్ట్రంలో ఎక్కడైనా అధికార పక్షం లో ఉన్నా నేతలు ప్రతిపక్షం లో ఉన్న నేతలపై తన ఎన్నికల వ్యూహాన్ని పెడుతారు . కానీ బాపట్లలో దానికి భిన్నం గా స్వతంత్ర అభ్యర్థైన అన్నం సతీష్ ప్యానల్ పై వ్యూహాలు రాచిస్తున్నారు. ఇటీవల సతీష్ ప్యానల్ కు చెందిన స్వతంత్ర అభ్యర్థి ప్రతాప్ ఇంటిలో బాపట్ల పట్టణ పోలీసులు సోదాలు జరిపి తన వ్యాపారం కోసం తెచ్చుకున్న చీరలను స్వాధీనం చేసుకున్నారని సతీష్ మాట్లాడారు.
తన అభ్యర్థులపై ఎందుకు అధికార పార్టీ నేతలు ఇంత ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని అన్నం సతీష్ ప్రభాకర్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రశ్నించారు. ప్రజలకు మీరు మంచి చేసినట్లయితే కచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.అంతే తప్ప అక్రమంగా తన ప్యానల్ సభ్యులను భయపడితే భయపడమని ఆయన మీడియా ముఖంగా హెచ్చరించారు.ప్రశ్నించే వ్యక్తి అన్నం సతీష్ అని బాపట్ల పుర ప్రజలకి తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్థానికులకు ఓట్లు వేస్తారా స్థానికేతరుడని పీఠం పై కూర్చోబెట్టుకుంటారా అంటూ ఎన్నికల ప్రచారంలో సతీష్ ప్రభాకర్ దూసుకుపోతున్నారు. గడచిన 10 సంవత్సరాలలో బాపట్ల ఎంత మేర అభివృద్ధి చెందిందో ప్రస్తుత నాయకులు, మాజీ నాయకులు తెలపగలుగుతారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు వచ్చి హామీలు ఇస్తారు కానీ ఏ ఒక్కరు కూడా వాటిని నిలబెట్టుకున్న దాఖలాలు ఉండవని సతీష్ మాట్లాడారు.
తన ప్యానల్ సభ్యులపై ప్రజలు నమ్మకం ఉంచి ఓసారి అవకాశం కల్పించాలని ప్రజలను సతీష్ ప్రభాకర్ అర్ధించారు. బాపట్ల పురపాలక సంఘనికి కట్టుబడి ఉండే నేతగా తాను పని చేస్తానని సతిష్ మాట్లాడారు. రాష్ట్రమంతా ఓవైపు బాపట్ల పట్టణం మాత్రం మరోవైపు ఉండేలా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నట్లు సతీష్ ప్రభాకర్ మీడియా ముఖంగా తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎన్నికల పర్వం ఏ విధంగా సాగుతుందో వేచి చూడాల్సిందే.




