Bapatla: ఢిల్లీ, గల్లి రాజకీయం తెలుసు.. జేడీ శీలం; ఫిర్యాదు బాక్సులు

Bapatla: బాపట్లలో మాజీ మంత్రి జేడీ శీలం, పీసీసీ ప్రధాన కార్యదర్శి గంటా అంజిబాబు ఎన్నికల ప్రచారం; ప్రతి వార్డులో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తామని హామీ.

Bakka Deepak, Bapatla
Published on: 20 Nov 2026 10:30 PM IST
Bapatla
X

Bapatla: ఢిల్లీ, గల్లి రాజకీయం తెలుసు.. జేడీ శీలం; ఫిర్యాదు బాక్సులు

బాపట్ల: అతి సామాన్యుడిలా ప్రజలందరితో కలిసి మమేకవడమే తనకు నిజమైన ఆనందమని మాజీ మంత్రి జెడి శీలం అన్నారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలంతా సామాన్యులైన నాయకులను ఎన్నుకోవాలని మాజీ మంత్రి జేడి శీలం అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అనునిత్యం ప్రజలతో గడిపే నాయకుడిని ప్రజలంతా ఎన్నుకోవాలని ఆయన మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వార్డులలో పర్యటిస్తుండగా జనాభిప్రాయం ఎంతో బాగుందని ఆయన వెల్లడించారు. ప్రజలకు అవసరమైన సమస్యను నేరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలపవచని శీలం మాట్లాడారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చడమే ఎజెండాగా పనిచేస్తున్నట్లు మాజీ మంత్రి శీలం తెలియజేశారు. కులాలను మతాలను అడ్డం పెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమాన్ని రెండు కల్లగా ముందుకు సాగించేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి గంటా అంజిబాబు మాట్లాడుతూ... ప్రతి వార్డులో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తూ మీ సమస్య ఏదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించిన వార్డులు ఆ యొక్క ఫిర్యాదు బాక్సులో ఓ లెటర్ రాసి దాంట్లో వేస్తే వెంటనే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆ లెటర్లోని సమస్యను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపే విధంగా ముందుకు వెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

అతి సామాన్యులను కౌన్సిలర్లుగా తాము ఎన్నికల బరిలో పెట్టినట్లు ఆయన వెల్లడించారు. నిరుపేదలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ మీ సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తామని గంట అంజిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రేమ్ కుమార్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరాజ్, కుమార్, రవి, బాజీ పాల్గొన్నారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla