Bapatla: బాపట్లలో ఈ నెల 29న కాపు కార్తీక వన సమారాధన!
Bapatla: బాపట్ల కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో నవంబరు 29న కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. ప్రతిభావంతులైన కాపు విద్యార్థులు నవంబరు 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Bapatla: బాపట్లలో ఈ నెల 29న కాపు కార్తీక వన సమారాధన!
బాపట్ల: బాపట్ల కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆదివారం కాపు కార్తీక వన సమారాధన నిర్వహించనున్నట్లు సంఘ పెద్దలు తెలిపారు. సాధారణంగా డిసెంబరు మొదటి ఆదివారం నిర్వహించే ఈ వేడుకను, బీచ్ ప్రాంతంలో భద్రతా ఆంక్షల నేపథ్యంలో వారం ముందుకు జరిపినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కాపు సామాజికవర్గ విద్యార్థులకు విద్యా పురస్కారాలు అందజేయనున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి పై చదువులు చదువుతూ కనీసం 60 శాతం మార్కులు సాధించినవారు అర్హులు.
దరఖాస్తులు నవంబరు 8 నుంచి అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబరు 20లోగా అందజేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. కాపు సంఘీయులందరూ వన సమారాధనలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




