Bapatla: బాపట్ల పట్టణం లో మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల వేడి!

Bapatla: బాపట్ల పట్టణంలో మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల వేడి. విలీన గ్రామాలతో కలిపి 44 వార్డులుగా విభజన. ఎన్నికలకు సిద్ధమవుతున్న కూటమి నాయకులు, ఆశావహులు.

Bakka Deepak, Bapatla
Published on: 8 Nov 2026 12:39 PM IST
Bapatla
X

Bapatla: బాపట్ల పట్టణం లో మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల వేడి!

Bapatla: రాష్ట్రంలో ఇటీవల జడ్పిటిసి, ఎంపీటీసీ,మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పట్టణ ప్రాంత నాయకులు జోరందుకున్నారు. రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగకుండా తాత్కాలిక నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కొన్ని రోజుల్లో తాత్కాలికంగా నిలిపిన మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తుంది. పట్టణంలో వార్డు ల పురపోరుకు నాయకులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బాపట్ల పట్టణంలోని విలీన గ్రామాలతో కలిపి మొత్తంగా 44 వార్డులుగా విభజించడం జరిగింది. బాపట్ల పట్టణంలోని గతంలో 10 వార్డు ప్రస్తుతం 25 వార్డు అయినా ప్యాడిసన్ పేట నందు పురపోరులో ప్రధాన కూటమి తరఫున స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు తనకు అవకాశం ఇస్తే పొరపురుకు సిద్ధంగా ఉన్నానంటూ గుడిపాటి సుజాత ఆశిస్తున్నారు. బాపట్ల పట్టణంలో ఇప్పటికే 44 వార్డులకు సంబంధించి రిజర్వేషన్ కేటాయింపులు పూర్తయ్యాయి. అధిష్టానం ఆదేశిస్తే ప్రతి వార్డులో కూటమి తరపున నాయకులు ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla