Bapatla: మార్టూరు, యద్దనపూడి మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యే పర్యటన!
Bapatla:బాపట్ల జిల్లా మార్టూరు, యద్దనపూడి మండలాల్లో అక్టోబర్ 8న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఏలూరి పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు.
Bapatla: మార్టూరు, యద్దనపూడి మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యే పర్యటన!
Bapatla: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి హోం మంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తో కలిసి ఈనెల 8 వ తేదీన మార్టూరు, యద్దనపూడి మండలాల్లో పర్యటించనున్నారు. రూ.20.27 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 1.00 గంటలకు ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 లకు క్యాంప్ కార్యాలయంలో 135 మందికి 67.28 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తారు. సాయంత్రం 2.00 గంటలకు రూ.2.90 కోట్లతో మార్టూరు టు ద్రోణాదుల వయా రాజుగారిపాలెం ఆర్ అండ్ బి రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు మార్టూరులో రూ.3.33కోట్లతో రోడ్డు ప్రారంభోత్సవం. రూ 3.90 లక్షలతో కొణిదెన రోడ్డుకు శంకుస్థాపన మహోత్సవం. సాయంత్రం 2.45 గంటల వరకు మార్టూరు వినాయకుడి గుడి వద్ద రూ.2.80 కోట్లతో నిర్మించిన మార్టూరు- గన్నవరం ఆర్ అండ్ బి రోడ్డును ప్రారంభిస్తారు. సాయంత్రం 3.30 గంటలకు గన్నవరం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు.
సాయంత్రం 3.45 గంటలకు పూనూరు గ్రామానికి చేరుకొని రూ.3 కోట్లతో నిర్మించిన ఆర్ అండ్ బి రహదారిని ప్రారంభిస్తారు. రూ. 29 లక్షల వ్యయంతో ఫిల్టర్ బెడ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. రెండు విలేజ్ హెల్త్ క్లినిక్ లు రూ.66 లక్షలు ప్రారంభోత్సవం వెటర్నరీ హాస్పిటల్ రూ.35లక్షలతో శంకుస్థాపన
హోమియోపతి హాస్పిటల్ రూ. 32 లక్షలు ప్రారంభోత్సవం. రూ.70 లక్షల సిసి రోడ్లను ప్రారంభిస్తారు. 600 ఎస్సీ నివాసాలకు జలజీవన్ మిషన్ రూ. రూ.94.30 లక్షలు ఇంటింటికి కుళాయిలు ప్రారంభోత్సవం. పల్లె పండుగలో భాగంగా రూ.41.30 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.




