Bapatla: బాపట్ల 25వ వార్డులో ఎంపీ కృష్ణ ప్రసాద్, ఇస్కా సునీల్ ప్రచారం

Bapatla: బాపట్ల 25వ వార్డులో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ పోతుల సునీత, చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ ప్రచారం; ఇంటింటికీ కుళాయి, అభివృద్ధి హామీలు.

Bakka Deepak, Bapatla
Published on: 21 Nov 2026 11:44 PM IST
Bapatla
X

Bapatla: బాపట్ల 25వ వార్డులో ఎంపీ కృష్ణ ప్రసాద్, ఇస్కా సునీల్ ప్రచారం

బాపట్ల: అభివృద్ధి,సంక్షేమం కూటమితోనే సాధ్యమని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల పట్టణంలోని 25 వ వార్డు నందు బాపట్ల మున్సిపల్ కూటమి చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ తరఫున ఎంపీ కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ పోతుల సునీత కలసి ప్రచారం నిర్వహించారు. వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆదుకోవాలని కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

వార్డులో ఎటువంటి సమస్య అయినా చైర్మన్ అభ్యర్థి అయిన సునీల్ కు తెలియజేస్తే వెంటనే మీ సమస్య ను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని ఆయన మాట్లాడారు. కేంద్రం నుండి బాపట్లకు అనేక నిధులు తీసుకొచ్చినట్లు ఎంపీ మాట్లాడారు. బాపట్లకు ఎంపీగా తనను దీవించినట్లే ఇస్కా సునీల్ ని కూడా దీవించాలని ఆయన స్పష్టం చేశారు.

కూటమి చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ మాట్లాడుతూ...

ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి వచ్చే విధంగా తాను పనిచేస్తానని బాపట్ల మున్సిపల్ కూటమి చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల పట్టణంలోని 25వ వార్డులో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడానని ఆయన తెలిపారు.

పట్టణంలోని 44 వార్డులలో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం పై నమ్మకం పెట్టుకోవాలని ఆయన వెల్లడించారు. డ్రైనేజీ వ్యవస్థ,దోమల బెడదను నుండి తప్పించి బ్యూటిఫుల్ బాపట్ల టౌన్ గా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, 25వ కౌన్సిలర్ అభ్యర్థి గుడిపాటి సుజాత పాల్గొన్నారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla