Bapatla: బాపట్లలో మున్సిపల్ రాజకీయం హీటెక్కింది!

Bapatla: బాపట్ల మున్సిపల్ చైర్మన్ పీఠం ఎస్సీ రిజర్వేషన్, బీజేపీకి కేటాయింపు. స్థానికేతరుడి అభ్యర్థిత్వంపై కూటమిలో అసంతృప్తి, వైసీపీ, కాంగ్రెస్ వ్యూహాలు.

Bakka Deepak, Bapatla
Published on: 11 Nov 2026 12:52 PM IST
Bapatla
X

Bapatla: బాపట్లలో మున్సిపల్ రాజకీయం హీటెక్కింది!

Bapatla: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది.రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలకు తాత్కాలికంగా ఎన్నికలు జరగని విషయం తెలిసిందే.దానిలోనే భాగంగా బాపట్ల మున్సిపాలిటీ లో గత కొద్ది రోజుల నుండి పురపోరుకు అనేక రాజకీయ పార్టీ నాయకులు బరిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో బాపట్ల మున్సిపాలిటీ చైర్మన్ పీఠంకు ఈసారి ఎస్సీ రిజర్వేషన్ కావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా కూటమి తరపున పార్టీ అధిష్టానం బాపట్ల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బిజెపి కి కేటాయించింది.

అయితే ఇక్కడే మొదలైంది అసలైన జగడం బాపట్ల చైర్మన్ పీఠాన్ని బిజెపికి కేటాయించడం తో బిజెపి అధిష్టానం స్థానికేతరుడును బాపట్ల కు పంపించింది. ఇది ఇలా ఉండగా వైసిపి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్లి స్థానికేతరుడు తమకు అవసరమా అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు.

ఇటీవల జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో బాపట్ల మండలం వైకాపా ఖాతాలోకి వెళ్లిపోయింది. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి తన వ్యూహాలతో జడ్పిటిసి, ఎంపీపీ పదవులను కైవసం చేసుకున్నారు. కూటమి నుండి స్థానికేతరుడు కావడంతో మున్సిపాలిటీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కచ్చితంగా చైర్మన్ పదవిని వైసీపీకి దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

మరోవైపు బిజెపి నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ కూటమిలో భాగంగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉండకపోవడం బాపట్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ పీఠాన్ని బిజెపికి కేటాయించారు గాని కనీసం అన్నం సతీష్ ప్రభాకర్ ఇప్పటికి కూడా ఆ నాయకుడుకు ఎందుకు సహకరించడం లేదు అనే ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.

చైర్మన్ సీటును బిజెపికి కేటాయించినప్పటికీ సతీష్ ప్రభాకర్ స్థానిక నాయకుడికి అయితే తన సహకారం ఉంటుంది. ప్రజలకు న్యాయం చేస్తారు స్థానికేతరుడు ఎన్నికల బరిలో నిలబడితే తన సహకారం ఉండకపోవచ్చునే విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అన్ని రాజకీయ పార్టీ నాయకులు వారి వారి వ్యూహాలతో స్థానికంగా ఉన్న నాయకులను బరిలో నిలబెడుతూ వారి వారి పార్టీల బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను చాలెంజిగా తీసుకొని కూటమిలో స్థానికేతరుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చైర్మన్ పదవిని బాపట్ల పట్టణంలో స్థానికంగా ఉన్న నేతను తమ పార్టీ నుండి నిలబెడుతున్నాము.

తమ పార్టీకి ప్రజలంతా సహకరించి స్థానికుడైన కాంగ్రెస్ నేతను గెలిపించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బాపట్ల పక్కనే ఉన్న చీరాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు పది వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకం మోగించింది.

స్థానిక ఎన్నికలలో మార్పు మొదలైంది తమ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈసారి బాపట్ల లో స్థానిక నాయకులను నిలబెడుతున్నాము తాము కూడా విజయ డంఖం మోగించేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి బాపట్లలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైందని చెప్పొచ్చు. స్థానికేతడుకు బాపట్ల ప్రజలు పట్టం కడతారా లేదా అన్నది వేచి చూడాలి.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla