Bapatla: ఎమ్మెల్యే, కలెక్టర్ చెప్పినా డోంట్ కేర్.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం!
Bapatla: బాపట్లలో రైతు బజార్ ఉండగా నడిరోడ్డుపైనే సాగుతున్న వ్యాపారాలు. కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు. ప్రజల తీవ్ర ఆగ్రహం.
Bapatla: ఎమ్మెల్యే, కలెక్టర్ చెప్పినా డోంట్ కేర్.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం!
Bapatla: ఎవరు చెబితే మాకేంటి మా పని మాదే అన్నట్లు వ్యవహరిస్తున్న బాపట్ల మున్సిపల్ అధికారులు. పట్టణంలోని మార్కెట్ వద్ద రైతు బజార్లో ఉండాల్సిన వ్యాపారస్తులు నడిరోడ్డు మీద వ్యాపారాలు చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడు. గత కొద్ది రోజులుగా క్రితం కలెక్టర్ ఆదేశాలు అంటూ శానిటరీ విభాగం,టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కెట్లో హడావుడి చేశారు.
మరి రైతు బజార్లో వ్యాపారం చేయాల్సిన రైతులు నడిరోడ్డు మీద వ్యాపారం చేస్తుంటే వాళ్ళ కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్న మిగతా వ్యాపారస్తులు. కొన్ని లక్షల ఖర్చు పెట్టి రైతు బజార్ నిర్మిస్తే దానిని నిరుపయోగంగా ఉంచడం మాత్రం మన బాపట్ల మున్సిపల్ అధికారులకు బాగా తెలుసు.
ఇది ఎవరి లాభం కోసం?, ఎవరి మెప్పుకోసం ? ఎందుకు ఈ విధంగా పట్టి పట్టినట్టు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. కంటికి కనిపించిన సమస్యని పట్టించుకోరు, ఎవరైనా చెప్పినా పట్టించుకోరు. మరి దీనివల్ల మున్సిపల్ అధికారులకు ఏమన్నా వాటా వస్తుందేమో అందుకని చూసి చున్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.




